ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు తీవ్ర సంచలనంగా మారింది.బాలీవుడ్ నటి శిల్పా భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో గత రెండు వారాల క్రితం ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను అరెస్టు చేసినప్పటి నుంచి పోలీసులు ఈ కేసును పలు కోణాలలో విచారిస్తున్నారు.ఈ కేసును ఆరా తీసేకొద్దీ పలు ఆసక్తికరమైన సంఘటనలు బయటపడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పోర్నోగ్రఫీ కేసు ద్వారా రాజ్ కుంద్రాను పోలీసులు కస్టడీలోకి తీసుకోగానే ఆ కేసుకు సంబంధించిన పలు సాక్షాలన్నింటిని నాశనం చేశారని ముంబై హైకోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ్ పాయ్ వెల్లడించారు.రాజ్ కుంద్రా అరెస్ట్ అవుతాడని ముందుగా గ్రహించడం చేతనే ఈ సాక్షాలు అన్నింటిని నాశనం చేశారని, తన వాట్సాప్ చాట్,హాట్ షాట్ బోలీ ఫేమ్ యాప్ లను ముందుగానే నాశనం చేసినట్లు తెలిపారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోకుండా రాజ్ కుంద్రా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం ఈ రెండు వెబ్ సైట్ల నుంచి సుమారు 50కి పైగా అశ్లీల చిత్రాల వీడియోలను సేకరించినట్లు తెలిపారు. రాజ్ కుంద్రా తీసిన ఈ పోర్నోగ్రఫీ వీడియోలను హాట్ షాట్ యాప్ లోఅప్లోడ్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు అనే ఆరోపణలు రావడం చేతనే గతవారం అతనికి బెయిల్ రద్దయిందని తెలిపారు.
ఈ విధంగా తన అరెస్టు గురించి ముందుగా గ్రహించి సాక్ష్యాధారాలను నాశనం చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై మరింత లోతుగా విచారణ చేపట్టే వరకు అతనికి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తనని డిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక ముందు ముందు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఎలాంటి నిజాలు బయట పడతాయన్న విషయం ప్రస్తుతం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…