సినీనటి యాషికా ఆనంద్. తొలిసారిగా బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న యాషికా.. తమిళ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని అభిమానులకు మరింత దగ్గరయ్యింది. ఇదిలా ఉంటే గతంలో యాషిక ఆనంద్ కు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో తన స్నేహితురాలు మరణించడంతో.. దానికి కారణం తానే అంటూ స్పందించింది.
గతంలో తాను ప్రయాణిస్తున్న కారు చెంగల్ పట్టు జిల్లా మహాబలిపురం వద్ద యాక్సిడెంట్ జరగగా అందులో ఉన్న తన స్నేహితులకు కూడా గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు కూడా తెలిపారు. ఇక ఇందులో హైదరాబాద్ కు చెందిన తన స్నేహితురాలు పావని అనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మరణించింది. ఇక యాషికాకు కూడా గాయాలు అవ్వగా.. తనకు ఓ కార్పొరేషన్ హాస్పిటల్ లో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయట పడింది.
తన ఆరోగ్యం నుండి మెల్లిమెల్లిగా కోలుకుంటున్న యాషిక ఆనంద్ తన ప్రమాదం తర్వాత మొదటి సారి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్పందించింది. ఇక ఇందులో తన ఫ్రెండ్ పావని గురించి స్పందిస్తూ.. నీ చావుకి నేనే కారణం అయ్యాను.. నీ కుటుంబాన్ని ఇంత కన్నీరుమున్నీరులో ఉంచినందుకు నాకు చాలా బాధగా ఉందని ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా తాను కూడా చనిపోవాలని అనుకున్నానని కూడా తెలిపింది. కానీ వీళ్లందరి వల్ల బతికున్నానని తెలిపింది. ఇక తన ప్రాణాల కోసం వేడుకున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాకుండా తనకు మరో జీవితాన్ని అందించినందుకు సోషల్ మీడియాకు ధన్యవాదాలు తెలిపింది.
ఇక సోషల్ మీడియాలో కొందరు తన స్నేహితురాలి మరణంకు నువ్వే కారణం అంటూ.. నీకు బతికే హక్కు లేదు. నువ్వు కూడా చనిపో అంటూ తెగ కామెంట్స్ కూడా చేశారని తెలిపింది. ఇక ఈ విషయం గురించి మరి కొందరు స్పందిస్తూ.. ఇదంతా కావాలని జరగలేదు కదా అనుకోకుండా జరిగింది కదా.. అందుకే ఇది ఆక్సిడెంట్ కిందకే వస్తుంది. దీనివల్ల నువ్వు ఎక్కువగా కృంగిపోయి.. ప్రాణాల మీదికి వచ్చే ఆలోచనలు తెచ్చుకోకు అని ధైర్యం ఇస్తున్నారు. కొందరు సోషల్ మీడియా సైకోలు తమ నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటారు వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోకు అని తెలుపుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…