R Narayana Murthy: అయ్యో దేవుడా.. ఏమిటి ఈ పరిస్థితి.. తలుచుకుంటే ఏడుపు వస్తోంది.. టికెట్ల విషయంపై స్పందించిన నారాయణమూర్తి!

R Narayana Murthy: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య టికెట్ల వివాదం ముదురుతోంది. ప్రభుత్వం టికెట్ ధరలపై వెనక్కి తగ్గకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు అసహనానికి గురువుతున్నారు. మొన్న నాని… నిన్న ఆర్. నారాయణ మూర్తి టికెట్ ధరలు, థియేటర్ల మూసివేతపై స్పందించారు. శ్యాంసింగరాయ్ సక్సెస్ మీట్ కు అతిథిగా వచ్చిన నారాయణ మూర్తి.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

R Narayana Murthy: అయ్యో దేవుడా.. ఏమిటి ఈ పరిస్థితి.. తలుచుకుంటే ఏడుపు వస్తోంది.. టికెట్ల విషయంపై స్పందించిన నారాయణమూర్తి!
R Narayana Murthy: అయ్యో దేవుడా.. ఏమిటి ఈ పరిస్థితి.. తలుచుకుంటే ఏడుపు వస్తోంది.. టికెట్ల విషయంపై స్పందించిన నారాయణమూర్తి!

ఏపీలో థియేటర్లు మూతపడుతుంటే ఏడుపు వస్తుందన్నారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసి వేశారనే వార్త చదిపినప్పుడు ఏడుపు వస్తుందని తన బాధను వ్యక్త పరిచారు.సినిమాలు తీసేవారు, చూపించేవారు బాగున్నప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని తెలిపాడు. సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి కోట్ల మంది జీవిస్తున్నారని.. వీరందరిపై ప్రభావం పడుతుందని అన్నారు.

R Narayana Murthy: అయ్యో దేవుడా.. ఏమిటి ఈ పరిస్థితి..తలుచుకుంటే ఏడుపు వస్తోంది.. టికెట్ల విషయంపై స్పందించిన నారాయణమూర్తి!

ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు ఈవిషయంపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని..ఆయన కోరారు. థియేటర్ల యజమానులు థియేటర్లను మూసివేయద్దని.. ఏపీ మంత్రులను కలిసి చర్చించాలని ఆయన సూచించారు. సమస్యను ఏపీ సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

నాని వ్యాఖ్యలను తప్పుగా చూడొద్దు.. దిల్ రాజు

కాగా ఇటీవల సినినటుడు నాని చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నారాయణ మూర్తి నిలిచారు. దిల్ రాజు మాట్లాడుతూ.. నాని వ్యాఖ్యలను తప్పుగా చూడద్దని.. నాని ఎమోషనల్ గా మాట్లాడారని.. ఆయన ఓ విధంగా మాట్లాడితే.. మరో విధంగా అర్థమైందని దిల్ రాజు అన్నారు. పరిస్థితిని ప్రభుత్వానికి వివరిస్తాం అని.. అప్పటి వరకు ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ,  ట్విట్స్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. టాలీవుడ్ పరిస్థితిపై నాని నెగిటివ్ గా ఏం స్పందించలేదని ఆయన అన్నారు.