Featured

Nagma: సౌరవ్ గంగూలీ నుంచి.. మనోజ్ తివారీ వరకు.. నగ్మా సాగించిన వ్యవహారాలు ఇవే..!

Nagma: బాలీవుడ్ నుంచి భోజ్‌పురి సినిమా వరకు నటనలో తన సత్తాను నిరూపించుకున్న నటి నగ్మాకు 47 సంవత్సరాలు. డిసెంబర్ 25న ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు. నటనతో తనదైన ముద్ర వేసిన నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉంది. అయితే ఆమెకు నలుగురు పెళ్లయిన వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు కనుకనే ఆమె ఒంటరిగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Nagma: సౌరవ్ గంగూలీ నుంచి.. మనోజ్ తివారీ వరకు.. నగ్మా సాగించిన వ్యవహారాలు ఇవే..!

నగ్మా 1974లో ముస్లిం, హిందూ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి ముస్లిం, తండ్రి హిందూ. ఆమె తండ్రి జైసల్మేర్ రాజ కుటుంబానికి చెందినవాడు. ఆ తర్వాత గుజరాత్‌కు, ముంబైకి మకాం మార్చాడు. ఈ నటి హిందీలోనే కాకుండా భోజ్‌పురి మరియు సౌత్ సినిమాల్లో కూడా పనిచేసింది. ఆమె సల్మాన్ ఖాన్ చిత్రం ‘బాఘీ: ఎ రెబెల్ ఫర్ లవ్’తో హిందీ చిత్రసీమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. నేడు ఆమె రాజకీయ నాయకురాలు కూడా. ఆమె సినిమాలు , కెరీర్ ఎప్పటిలాగే ప్రజాదరణ పొందాయి. అదేవిధంగా.. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తలో నిలుస్తూ వస్తోంది.

Nagma: సౌరవ్ గంగూలీ నుంచి.. మనోజ్ తివారీ వరకు..నగ్మా సాగించిన వ్యవహారాలు ఇవే..!

ఆమె భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్ పెట్టుకున్నారని.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయం 2001 సంవత్సరం నాటిది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని.. వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అప్పట్లో వీరిద్దరూ ఖండించారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలు వచ్చాయి.

అతడితో విడిపోయిన తర్వాత ఆమె సౌత్ నటుడు శరత్ కుమార్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. శరత్ కుమార్ నటుడే కాదు.. ఎంపీ కూడా. అతనికి కూడా అప్పటికే పెళ్లయింది. ఇద్దరూ ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ.. వారి సంబంధం సానుకూలంగా సాగలేదు. వీరి వ్యవహారం శరత్ భార్యకు తెలియడంతో వివాహ బంధానికి స్వస్తి చెప్పి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీని తరువాత నటి కూడా శరత్ తో తన సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంది. వీరిద్దరి మధ్య కూడా బ్రేకప్ అయింది.

నగ్మా రిలేషన్ లో ఉన్న వారిద్దరూ వివాహితులే..


ఆ తర్వాత ఈమె సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పి.. భోజ్‌పురి చిత్రాల్లో నటించింది. అక్కడ సూపర్ స్టార్ రవి కిషన్‌తో చాలా చిత్రాలలో యాక్ట్ చేసింది నగ్మా. తర్వాత వారి ప్రేమ గురించి మీడియాలో చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుండగా.. అతడి భార్యకు తెలిసింది. దీంతో నగ్మాను అతడు దూరం పెట్టేశాడు. రవి కిషన్‌తో విడిపోయిన తర్వాత, నగ్మా నటుడు మనోజ్ తివారీతో ఎఫైర్ పెట్టుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అప్పట్లో మనోజ్, రవికిషన్ మధ్య ఇండస్ట్రీలో పెద్ద పోటీ నెలకొంది. దీని గురించి నటి ఒకసారి మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి పని చేస్తున్నామంటే, మా మధ్య ఏదైనా జరుగుతున్నట్లు అర్థం కాదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మనోజ్ తివారీ మరియు రవి కిషన్ ఇద్దరూ వివాహితులు కావడం విశేషం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago