Featured

RRR Pre Release: ఎన్టీఅర్ ప్రేమను తట్టుకోలేం.. చరణ్ నా హీరో : రాజమౌళి

RRR Pre Release: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ సినిమా జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు నడుస్తున్నాయి. ఇప్పటికే హిందీలో ఈ సినిమా విడుదల కానుండగా.. ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అంగరంగ వైభంగా పూర్తి చేశారు.

RRR Pre Release: ఎన్టీఅర్ ప్రేమను తట్టుకోలేం.. చరణ్ నా హీరో : రాజమౌళి

ఇక తాజాగా RRR తమిళ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ కు దర్శకుడు రాజమౌళితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఇక జక్కన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

RRR Pre Release: ఎన్టీఅర్ ప్రేమను తట్టుకోలేం.. చరణ్ నా హీరో : రాజమౌళి

ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..తాను ఓ సీన్ ను మైండ్ లో ఎలా అనుకుంటానో.. దానికి తగ్గట్లుగా ఎన్టీఆర్ లీనమైపోయి.. ఆవిజువల్స్ కు పర్ఫెక్షన్‌గా ఇస్తాడు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ స్టార్ యాక్టర్ కాబట్టి ఎక్కడ నిలబడాలో.. ఎలా నటించాలో.. ఏం చేయాలో చెప్పాల్సిన పనిలేదన్నారు రాజమౌళి. ఎన్టీఆర్ లాంటి నటుడు ఉన్నందుకు తెలుగు పరిశ్రమే కాదు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వపడాలని అన్నారు .

RRR Pre Release : చరణ్ ఓపెన్ మైండ్‌తో సెట్ పైకి వస్తాడు..

ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చరణ్ నా హీరో.. సెట్ లోకి వచ్చేటప్పుడు తాను పనిపై ఎక్కువగా ఆలోచిస్తూ వస్తుంటానని.. కానీ చరణ్ మాత్రం సెట్స్‌పై ఓపెన్ మైండ్‌తో వచ్చి తన బెస్ట్ ఇస్తాడని చెప్పాడు. తన దగ్గరకు వచ్చి.. ఏం కావాలో చెప్పండి అంటూ అడుగుతాడని జక్కన్న చెప్పుకొచ్చాడు. చరణ్ సురక్షితమైన నటుడని.. తన గురించి తాను సెక్యూర్ గా ఫీల్ అవుతాడని అన్నారు. ఇలాంటి నటుడిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇద్దరికీ భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నాయన్నారు. ఇటు తారక్ ప్రేమను.. అటు చరణ్ ఆప్యాయతను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు అంటూ రాజమౌళి పొగడ్తలతో ముంచెత్తాడు. అభిమానులను ఖుషీ చేసేందుకు రాజమౌళి తెలుగులో ఈ ప్రసంగం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago