Nayanathara -Vignesh: నయన్ విగ్నేష్ కవలల విషయంలో తప్పని తెలిస్తే శిక్ష తప్పదా.. ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా?

Nayanathara -Vignesh: ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది నయనతార విగ్నేష్ శివన్ కవల పిల్లల విషయం అని చెప్పాలి.నయనతార విగ్నేష్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ నెలలో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే పెళ్లయిన నాలుగు నెలలకే ఈ దంపతులు తల్లిదండ్రులు అయ్యారంటూ ఆదివారం పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లయిన నాలుగు నెలలకే పిల్లలు పుట్టడం ఏంటి అసలు నయనతార ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ సరోగసి ద్వారా పెళ్లికి ముందే పిల్లలను ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ విషయంపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేయగా ఏకంగా తమిళనాడు ప్రభుత్వం వీరిపై ఎంక్వయిరీకి ఆదేశాలు కూడా జారీచేస్తుంది.వీరు సరోగసి ద్వారా పిల్లలను కన్నట్టు ఎక్కడ చెప్పకపోవడంతో పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. అయితే వీళ్ళు కనుక సరోగసి విధానంలో నిబంధనలను పాటించకపోయి ఉంటే తప్పనిసరిగా వీరికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ పలువురు భావిస్తున్నారు.

Nayanathara -Vignesh: ఊచలు లెక్క పెట్టాల్సిందేనా..

ఇకపోతే సరోగసి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి వివాహమైన తర్వాత ఐదు సంవత్సరాల వరకు పిల్లలు కలగని నేపథ్యంలో సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వవచ్చు. అలాగే వైద్య పరమైన అనారోగ్య సమస్యలు కనుక ఉంటే ఈ సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వవచ్చు అలా కాకుండా ఈ నిబంధనలను ఉల్లంగించిన వారికి 10 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 10 లక్షల అపరాధం కూడా విధించనున్నారు. మరి నయనతార విషయంలో తప్పు అని తేలితే కనుక వీరికి కూడా ఈ శిక్ష తప్పదా అంటూ కొందరు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.