Big Boss season 6 : బిగ్ బాస్ షో గురించి మంచిగా చెప్పే వాళ్ళ కంటే తిట్టే వాళ్ళే ఎక్కువ. అయినా షోకి రేటింగ్ ఉంటూ దూసుకుపోతోంది. అయితే ఈసారి రేటింగ్స్ లో వెనుకబడింది అది వేరే విషయం. షోలో బూతులు తిట్టుకోవడం, డబల్ మీనింగ్ డైలాగులు మరో ఎత్తు. ఈ షోని ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడలేక పోతున్నామని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కూడా. ఇక సిపిఐ నారాయణ వంటి వారైతే పరుషంగా షో గురించి విమర్శిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా షో చూసేవాళ్ళు లేక పోలేదు. సిపిఐ నారాయణ వంటివారు ఏకంగా బిగ్ బాస్ ఒక బూతు షో అంటూ మాట్లాడినా ఎక్కడా అలా లేదు బాగుంది షో అంటూ చూసే జనం కూడా ఈ సీజన్ లోని కంటెస్టెంట్స్ తీరు మాత్రం అస్సలు బాగోలేదు అంటున్నారు.
హద్దులు దాటిన ఇనయా, ఆర్జే సూర్య రొమాన్స్…
మొన్నటివరకు ఆరోహి తో క్లోజ్ గా ఉన్న సూర్య ఒక రకంగా ఆరోహి ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి ఎలిమినేట్ అవ్వడానికి కారణం. వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉండటం తప్పు కాదు, కానీ ఆరోహి, సూర్య లకు బయట లవర్స్ ఉన్నారు. ఈ విషయం వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లో చెప్పారు. అందుకే వాళ్ళు క్లోజ్ గా ఉండటం అందరికీ వెగుటు పుట్టించింది. ఒకవేళ బయట వాళ్లకు రిలేషన్ లేకపోయింటే క్యూట్ లవ్ స్టోరీ అంటూ జనం కూడా చూసే వాళ్ళు. ఇక ఆరోహి మీద నెగెటివ్ పెరిగి ఆమె ఇంట్లో నుండి వెళ్లి పోయింది. ఇక ఇప్పుడు ఆర్జే సూర్య ఇనయా తో క్లోజ్ గా ఉన్నాడు.
ఫ్రెండ్స్ గా ఉండటం తప్పు కాదు కానీ బరి తెగించి హుగ్గులు, ముద్దులు పెట్టుకోవడం అసభ్యకరంగా ప్రవర్తించడం తప్పు. నాకు క్లోజ్ గా ఉన్న అందరూ వెళ్ళిపోతారు అంటూ సూర్య ఏడ్చి రెండు రోజులైనా కాలేదు అపుడే ఇనయా తో అతుక్కుపోయి ఉంటున్నాడు. వీళ్లిద్దరూ ఇంత క్లోజ్ ఎప్పటి నుండి అని ఆడియన్స్ అనుకుంటున్నారు. కొంచెం సందు దొరికితే చాలు ఒక మూల చూసుకొని ఇద్దరూ టైట్ హుగ్స్ చేసుకోవడం, ముఖమంతా ముద్దులు పెట్టుకోవడం చూడటానికి అసభ్యకరంగా చేస్తున్నారు. ఇనయా ఒళ్ళో తల పెట్టుకుని, ఆమె డ్రస్ సర్దుకోవడం వంటివి, చాలా చెండాలంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలానే ఆరోహి ని స్టోర్ లోకి తీసుకెళ్లి సూర్య ఇంటి నుండే బయటకు పంపాడు ఇక ఇప్పుడు ఇనయా వంతు అని ఆడియన్స్ అనుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…