బాబోయ్.. ఇంట్లో అన్నం పెట్టడం లేదు.. ఈ లాజిక్ లేని సీరియల్ ను ఇకనైనా ఆపండ్రా బాబూ.. అంటూ..

కార్తీకదీపం.. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న ఈ సీరియల్‌ అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఎన్నో ట్వీస్ట్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి టీవీలకే అతుక్కుపోయేలా చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సీరియల్‌కు అభిమానులు అయిపోయారు. అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్‌.. లీడ్‌ పాత్రల మధ్య గొడవలు పెట్టించి సాగదీస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎపిసోడ్ ప్రేక్షకులకు పెద్ద తలనొప్పిగా మారింది.

దర్శకుడు కనిపిస్తే కొట్టేయాలన్న కోపంతో ఉన్నారు నెటిజన్లు. కోర్టులో జరిగిన సీన్ చూస్తే అలానే అనిపిస్తుంది. మోనిత చినిపోయినట్లు .. కార్తీక్ జైలుకు వెళ్లడం.. కట్ చేస్తే.. మొత్తం ఫేక్ అని తెలిసి.. పోలీస్ ఆఫీసర్ రోషిని బలి చేయడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తం లాజిక్ మిస్ అవుతుందని.. అర్థం పర్థం లేకుండా డైరెక్టర్ కథను నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంత పెద్ద పోలీసు ఆఫీసర్ రోషిని సీసీ కెమెరాలు చెక్ చేయాలన్న ఆలోచన లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కార్తీక దీపం వల్ల రాత్రి ఇంటికి వెళ్తే తమకు అన్నం పెట్టడం లేదంటూ.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. లాజిక్ లేకుండా.. ఆసుపత్రిలో మోనిత పేషెంట్ కు నర్సు లేకుండా ఎలా చెక్ చేస్తుంది అంటూ.. మండిపడ్డాడు మరో నెటిజన్.

ఈ సీరియల్ చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ఉందంటూ కామెంట్ చేశారు. సీరియల్ ను పొడిగించాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారు తప్ప.. ఏ మాత్రం సీరియల్ లో పసలేదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత చేసినా.. ఎన్ని నెగెటివ్ కామెంట్లు పెట్టినా.. ఆ సీరియల్ కు వచ్చే రేటింగ్ వస్తూనే ఉంటుంది. నెగెటివ్ గా ఉండే వాళ్లు కూడా ఉంటూనే ఉంటారు.