Guneet Monga: నన్ను నమ్మి ఇరుగు పొరుగు వారు రూ.50 లక్షలు ఇచ్చారు..ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాత..!

Guneet Monga: ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో మన భారతదేశానికి రెండు ఆస్కార్ అవార్డులు వరించాయి. ఒకటి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించగా..మరొకటి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ లభించింది.బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా ఉండగా ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన న్యూస్ 18 రైజింగ్ ఇండియాలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర నిర్మాత గునీత్ మోంగా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యులో ఆమె మాట్లాడుతూ.. జర్నలిజం విద్యార్థి నుండి ఏస్ ఫిల్మ్‌మేకర్ వరకు తన ప్రయాణాన్ని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడారు. “నేను ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్ చేసాను. ఆ తర్వాత, నా ఇరుగు పొరుగు వారు 50 లక్షలతో నన్ను సంప్రదించి, తాము ఒక స్టూడియోని సృష్టించాలనుకుంటున్నామని చెప్పారు.

ఆ తర్వాత నేను ముంబయి వెళ్లి సినిమా నిర్మాణం చేస్తాను డబ్బులు ఇవ్వమని అడిగాను. ఆ సమయంలో నా వయసు 21 నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో తెలీదు. ఆ తర్వాత ఆ డబ్బుతో నేను ముంబై వెళ్లి కేఫ్‌లో మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న వారితో నేను సినిమా తీయాలనుకుంటున్నాను, నా దగ్గర 50 లక్షలు ఉన్నాయని అని చెప్పాను. అలా ..ఈ పాయింట్ నుండి, నిర్మాతగా నా ప్రయాణం మొదలుపెట్టాను.

కేఫ్‌లో పనిచేస్తూ నిర్మాతగా…

21 ఏళ్ల వయసులో సే సలామ్ అనే మొదటి సినిమా చేశాను. ఆ తర్వాత దాస్వదానియా చేసాను. అలాగే నేను 2010లో సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా పని చేసి 2008లో ఒక షార్ట్ ఫిల్మ్‌ నిర్మించాను. ఇక ఇప్పుడు 2020 లో ది ఎలిఫెంట్ విస్పరర్స్” నిర్మించాను అని గునీత్ తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది.