Anchor Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనసూయ యాంకర్ గా ఎంత గుర్తింపు పొందిందో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసి పోస్టుల వల్ల కూడా అంతే పాపులర్ అయింది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్టులకు నేటిజన్స్ నుండి అనేక విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అనసూయ మాత్రం వాటిని లెక్కచేయకుండా తనదైన శైలిలో తనని విమర్శించే వారి మీద విరుచుకుపడుతూ ఉంటుంది.
ఇలా ఆమె డ్రెస్సింగ్, ఫోటో షూట్స్ పై ట్రోల్ చేస్తూ రచ్చ చేయటమే కాకుండా ఆంటీ అంటూ ట్రోల్ చేస్తుంటారు. గతంలో ఈ విషయమై అనసూయ కొందరిపై కేసులు కూడా పెట్టింది. అయితే వారికి శిక్ష పడిన విషయాన్ని అనసూయ ఇటీవలే పేర్కొంది. అంతే కాకుండా ఇకపై తాను అలాంటి వాటిపై స్పందించనని, అయితే తనని ట్రోల్ చేస్తే తాను ఏదైనా చేయగలననే సందేశం ట్రోలర్స్ కి రీచ్ అయితే చాలు అని తెలిపింది.
తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్రోలర్స్ మీద ఆంక్షలు విధించారు. మహిళలను కించపరిచేలా, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో ట్రోలింగ్ చేసినా, ఫోటోలు మార్ఫింగ్ చేసినా కఠినమైన శిక్షలు పడతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అనసూయ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది.
శిక్షలు పడతాయి…
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ బుల్లితెరకు దూరమై ప్రస్తుతం వెండితెర మీద తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలతో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…