Rocking Rakesh: ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా బాగా పాపులర్ అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. చాలాకాలంగా జబర్దస్త్ లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. ఇదిలా ఉండగా జబర్దస్త్ లో యాంకర్ సుజాతతో ప్రేమాయణం నడిపి రాకేష్ మరింత ఫేమస్ అయ్యాడు.
అందరిలాగే మీరు కూడా కేవలం జబర్దస్త్ స్కిట్ ల కోసం మాత్రమే ప్రేమికులుగా నటిస్తున్నారని అందరూ భావించారు. అయితే వీరు మాత్రం ఒకరినొకరు ప్రేమించుకొని ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రి రోజా దంపతులతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ జబర్దస్త్ లో స్కీట్లు చేస్తూ సందడి చేస్తున్నారు.
తాజాగా ఓ స్కిట్ లో భాగంగా సుజాతపై రాకింగ్ రాకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అందరి ముందు సుజాత గురించి మాట్లాడు సుజాత తనని బలవంతంగా ప్రేమించి పెళ్ళి చేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ రాకేశ్ చేసిన వ్యాఖ్యలకు సుజాత అభిమానులు మండిపడుతున్నారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ నవ్వుకుంటున్నారు.
స్కిట్ లో భాగమే…
ఓ స్కిట్ లో భాగంగా నిజం చెబితే పండు కదులుతుందని చెప్పటంతో రాకేశ్ తమ ప్రేమ గురించి చెప్పాడు. అయితే పండు కదలకపోవటంతో సుజాత తనని ప్రేమించి,పెళ్లి చేసుకోమని టార్చర్ చేసిందని చెప్పాడు. దీంతో పండు కదులుతుంది. అయితే రాకేశ్ చెప్పిన మాటలకు సుజాత ఒక్కసారిగ షాక్ అవ్వగా అక్కడున్న వారు మాత్రం కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే పెళ్లి అయి కేవలం నెల రోజులు దాటిందని, శుభం పలకాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వారి అభిమానులు సూచిస్తున్నారు.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…