Netra & Vamsi organic farming : ఆకుకూరలను అమ్ముతూ… ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న యువజంట… నెల సంపాదన ఎంతంటే…: నేత్ర & వంశీ ఆర్గానిక్ ఫార్మింగ్

Netra & Vamsi organic farming: నేటి యువతరం ఎలాగోలా బ్రతికేయాలని అనుకోవడం లేదు. రిస్క్ చేయడానికి నచ్చింది చేయడానికి ఎంతమాత్రం వెనుకడుగు వేయడం లేదు. కంప్యూటర్ ముందు కూర్చొని లక్షలు సంపాదించే ఉద్యోగాలను సైతం వదులుకుని నచ్చిన వ్యవసాయం చేసుకుంటున్న టెక్కీలు ఎంతో మందిని చూస్తున్నాం. అలానే ఈ యువజంట కూడా వ్యవసాయం చేయాలని అనుకున్నారు. అందులోనూ ఏమాత్రం క్రిమిసంహారకాలు లేని ఆహరం అందించాలని అనుకున్నారు. ఆ దిశగా అడుగులువేస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు.

ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఆనందం…

సామాజిక మాధ్యామాల ద్వారా పేరు తెచ్చుకున్న నేత్ర, వంశీ జంట ఇద్దరూ ఆర్గానిక్ వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. మొదట చేయాలనుకున్న వీరి వద్ద వ్యవసాయ భూమి లేదు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పగా ఒక ఎన్ఆర్ఐ తన భూమిని వాడుకోమని ఉచితంగా అందించడంతో మొదట మూడు నెలలు ఫార్మింగ్ ఎలా చేయాలో నేర్చుకుని ఆపైన ఇద్దరూ కలిసి హైదరాబాద్ శివార్లలో మొదలు పెట్టారు. ఆర్గానిక్ ఉత్పత్తులను వారి సొంత వెబ్సైటు ద్వారా కొనుగోలుకు పెడుతున్నారు.

మొదట్లో కొంత తడబడినా ఇపుడు లాభాలను చూస్తున్నారు. మొదట తేనె వంటివి విక్రయించిన వీరు ఇపుడు బియ్యం మొదలయినవి అమ్ముతున్నారు. వాళ్ళ వ్యవసాయ భూమిలో చిక్కుడు వంటివి పెట్టిన వీళ్ళు ఏమాత్రం క్రిమిసంహారక మందులు లేకుండా పండిస్తూ ఆదర్శనంగా నిలుస్తున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొంచం ధర అయినా మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంటే మేలని ఈ జంట చెబుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడి పోయి నెలకు కొంత లాభలను చూస్తున్నామంటూ చెబుతున్నారు.