చైనాలో డైనోసర్ల అవశేషాలు.. తవ్వకాలు జరుపుతుండగా బయట పడ్డ అస్థిపంజరం..

ప్రపంచంలో జనాభా అధికంగా గల దేశం చైనా. తర్వాత స్థానంలో మన భారతదేశం ఉంది. అయితే చైనాలో అక్కడి శాస్త్రవేత్తలు రెండు డైనోసార్ల నమూనాలను కనుగొన్నారు. ఇవి రెండు దాదాపు ఓ పెద్ద నీటి తిమింగలం అంత సైజులో ఉన్నాయని వారు తెలిపారు. 130 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. మొదటిది 65 అడుగుల పొడవు.. రెండోది 55 అడుగుల పొడవుతో ఉన్నాయని భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

వీటిని వాయవ్య చైనాలోని కనుకొన్నట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. వీటి యొక్క పేర్లను శాస్త్రవేత్తలు సిలుటిటాన్ సినెన్సిస్ లేదా “సీలు’’, హమిటిటాన్ జిన్జియాంగెన్సిస్ లేదా హమీ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. శిలాజాలు జిన్జియాంగ్‌లో కనుగొన్నారు. అందుకే అలా పేరు పెట్టారు. చైనాలో సీలు అంటే సిల్క్ రోడ్ అని అర్థం. హీమి అంటే కొనుకొన్న నగరాన్ని సూచిస్తుంది. ఇందులో ఒక డైనోసర్ మొక్కలను మాత్రమే తింటుందని తెలిపారు.

ఇవి ఆసియా, దక్షిణ అమెరికాలలో తిరిగేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఓ ఇంట్లో పెద్ద సంఖ్యలో ఓ ఇంట్లో డైనోసార్ల గుడ్లు దొరికాయి. అధికారులకు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి పరిశోధనలు చేశారు. అక్కడ దాదాపు 231 గుడ్లు ఒక డైనోసార్ అస్థిపంజరం దొరికింది. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్విస్తున్నాడు. తవ్వకాలు జరుపుతుండగా శిథిలావస్థలో ఉన్న 231 డైనోసార్ గుడ్లతో పాటు అస్తిపంజరం బయటపడింది.

అయితే ఇంటి యజమాని వారికి ప్రభుత్వం అప్పగించకుండా దాచిపెట్టుకున్నారని అధికారులు చెప్పారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటిదే ఇప్పుడు మళ్లీ వాటి అవశేషాలు దొరికాయి. ఇలా డైనోసర్ల చరిత్రను అక్కడి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.