Niharika: దానికోసమైనా రెండో పెళ్లి చేసుకుంటాను.. నిహారిక సంచలన వ్యాఖ్యలు!

Niharika: మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. కానీ ఇంట్లో వారిని ఎదిరించి మొదటిసారి మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్ గా ఈమెకు చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం నిహారిక ఇండస్ట్రీలో నటిగా అలాగే నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె వ్యక్తిగత విషయం పక్కన పెట్టే వృత్తిపరమైన విషయానికి వస్తే.. నిహారిక 2020వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం పెద్దలను నిశ్చయించిన వివాహం.

పెళ్లి తర్వాత కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈమె వైవాహిక జీవితం కొంతకాలం పాటు సంతోషంగా సాగిన అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు కారణంగా పెళ్లైన రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా ఈమె విడాకులు తీసుకుని విడిపోవడంతో చాలామంది ఎన్నో విమర్శలు చేశారు అయితే నిహారిక తిరిగి మరీ పెళ్లి చేసుకుంటుందా అని సందేహం అందరిలోనూ ఉండేది.

పిల్లలు అంటే చాలా ఇష్టం..
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక రెండో పెళ్లి గురించి తెలియజేశారు నాకు పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల కోసమైనా తాను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. అయితే ఒక బంధం ఏర్పడిన తర్వాత తెగిపోయింది అంటే ఎన్నో కారణాలు కావచ్చు ఇలా ఒకసారి ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మరొకరిపై ప్రేమ కలగదని కాదు కచ్చితంగా ఇతరులపై కూడా ప్రేమ పుడుతుంది అంటూ ఈమె తెలిపారు. అయితే తాను ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ చేశానని తాను లవ్ మ్యారేజ్ చేసుకున్న పెద్దల సమక్షంలోని చేసుకుంటానని తెలిపారు.