Nithya Menen: ఆరేళ్ల నుంచి ఆ వ్యక్తి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నా… వైరల్ అవుతున్న నిత్యమీనన్ కామెంట్స్!

Nithya Menen: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ గత కొద్దిరోజుల క్రితం ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆరు సంవత్సరాల నుంచి ఓ వ్యక్తి తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఏకంగా 30 నెంబర్ల నుంచి తనకి ఫోన్ కాల్స్ చేస్తూ ఎంతగానో విసిగించారంటూ నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఈ విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ఈమె సంతోష్ వర్కి అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల నుంచి తనని వేధిస్తున్నాడని నిత్యం కొత్త నెంబర్లను ఫోన్ చేస్తూ తనను వేధించే వారంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిత్యమీనన్ చేసిన వ్యాఖ్యలపై సంతోష్ వర్కీ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యమీనన్తను గురించి చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.

ఒక వ్యక్తికి ఎన్ని సిమ్ కార్డులు ఇవ్వగలరో జనాలే గుర్తించాలని ఈయన తెలిపారు.నిత్యామీనన్ కి మరొక వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తన తల్లి చెప్పగా తన తండ్రి మాత్రం తనకు నిశ్చితార్థం జరగలేదని చెప్పారు. అయితే నిత్యమీనన్ కుటుంబ సభ్యులు నాపై లైంగిక ఆరోపణలు కేసు కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా సంతోష్ పేర్కొన్నారు.

Nithya Menen: తన గురించి ఇవన్నీ తెలిస్తే ప్రేమించే వాడినే కాదు…

తనకు నిత్యమీనన్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని అయితే గతంలో తనని పెళ్లి కూడా చేసుకోవాలని భావించానని సంతోష్ తెలిపారు. ప్రస్తుతం నిత్యామీనన్ పట్ల తనకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదని,నిత్య మీనన్ గురించి తనకు ఈ విషయాలన్నీ ముందే తెలిసి ఉంటే తనని ప్రేమించే వాడే కాదంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా సంతోష్ వర్కే అనే ఈయన ఒక యూట్యూబర్ గా పని చేస్తున్నారు. ఈయన నిత్య మీనన్ ను రిజెక్ట్ చేయడం ఏంటి అంటూ ఈయన వ్యాఖ్యలపై పలువురు నెటిజెన్లు స్పందిస్తున్నారు.