Movie News

Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లు వీళ్లే… వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్?

Bigg Boss6: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే సీజన్ 6 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమం గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లిస్ట్ బయటకు వచ్చింది.

ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే… దీపికా పిల్లి, శ్రీహాన్, ఆర్ జ సూర్య, చలాకీ చంటి, గీతూ రాయల్, యాంకర్ ఉదయభాను, అమర్ దీప్, ఆదిరెడ్డి వంటి తదితరులు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమంలో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.అలాగే నాన్ స్టాప్ సీజన్లో పాల్గొన్న కొందరు కంటెంట్ లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం.

Bigg Boss6: ఆసక్తిని పెంచుతున్న బిగ్ బాస్….

ఇక గత సీజన్ ఫైవ్ సిరి పాల్గొనగా సీజన్ సిక్స్ లో తన ప్రియుడు శ్రీహాన్ పాల్గొనబోతున్నారు.అలాగే జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమర్ దీప్ తాజాగా నటి తేజస్వినితో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన తన పెళ్లిని వాయిదా వేసుకుని ఈ కార్యక్రమానికి వస్తారా లేక త్వరగా పెళ్లి పూర్తి చేసుకుని ఈ కార్యక్రమానికి వస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

18 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

18 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago