Nithya Menen: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ గత కొద్దిరోజుల క్రితం ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆరు సంవత్సరాల నుంచి ఓ వ్యక్తి తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఏకంగా 30 నెంబర్ల నుంచి తనకి ఫోన్ కాల్స్ చేస్తూ ఎంతగానో విసిగించారంటూ నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఈ విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ఈమె సంతోష్ వర్కి అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల నుంచి తనని వేధిస్తున్నాడని నిత్యం కొత్త నెంబర్లను ఫోన్ చేస్తూ తనను వేధించే వారంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిత్యమీనన్ చేసిన వ్యాఖ్యలపై సంతోష్ వర్కీ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యమీనన్తను గురించి చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.
ఒక వ్యక్తికి ఎన్ని సిమ్ కార్డులు ఇవ్వగలరో జనాలే గుర్తించాలని ఈయన తెలిపారు.నిత్యామీనన్ కి మరొక వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తన తల్లి చెప్పగా తన తండ్రి మాత్రం తనకు నిశ్చితార్థం జరగలేదని చెప్పారు. అయితే నిత్యమీనన్ కుటుంబ సభ్యులు నాపై లైంగిక ఆరోపణలు కేసు కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా సంతోష్ పేర్కొన్నారు.
తనకు నిత్యమీనన్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని అయితే గతంలో తనని పెళ్లి కూడా చేసుకోవాలని భావించానని సంతోష్ తెలిపారు. ప్రస్తుతం నిత్యామీనన్ పట్ల తనకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదని,నిత్య మీనన్ గురించి తనకు ఈ విషయాలన్నీ ముందే తెలిసి ఉంటే తనని ప్రేమించే వాడే కాదంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా సంతోష్ వర్కే అనే ఈయన ఒక యూట్యూబర్ గా పని చేస్తున్నారు. ఈయన నిత్య మీనన్ ను రిజెక్ట్ చేయడం ఏంటి అంటూ ఈయన వ్యాఖ్యలపై పలువురు నెటిజెన్లు స్పందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…