వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ‘నితిన్’.. యూవీ బ్యానర్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్టు లకు కమిట్ అవుతున్నాడు ఈ యంగ్ హీరో.. ఈ ఏడాది ఆరంభంలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ , ప్రియప్రకాష్ హీరోయిన్లుగా నటించారు. మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేసాడు నితిన్. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మ్యాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఇది హిందీలో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి ఈ తెలుగు రీమేక్.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలతోపాటు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది.అలాగే యాత్ర సినిమా దర్శకుడితోనూ ఓ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.ఇకపోతే చైతన్య కృష్ణ దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఒకవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మరోవైపు మీడియం రేంజ్ సినిమాలు తీస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉన్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నితిన్ హీరోగా ఓ మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఈ ప్రాజెక్ట్ కి ఇంకా డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది..ఇక ప్రస్తుతం నితిన్ నటిస్తున్న మ్యాస్ట్రో సినిమా షూటింగ్ దశలో ఉంది.. జాన్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది…!!