టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.దుబాయ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ ని కూడా ప్రారంభించింది. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.సర్కారీ వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో చేస్తారా అనే విషయంపై పెద్ద చర్చ కొనసాగుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
సర్కారీ వారి పాట తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయడానికన్న ముందుగా మరొక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్ ఎవరు అనే అనుమానాలు కలిగాయి.సర్కారు వారి పాట తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటనను ఈ రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో విడుదలైన అతడు, ఖలేజా మంచి విజయాలను అందుకున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది.అయితే వీరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ప్రకటన ఈ రోజు విడుదల కాకపోయినా ఈ నెల 31 తప్పకుండా వెలువడే అవకాశం ఉంది.
ఇకపోతే సర్కారీ వారి పాట సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. అదేవిధంగా సినిమా టీజర్ ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ రోజున విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలో సందడి చేయనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…