టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలో కూడా నటిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రానా విరాటపర్వం అనే సినిమాలో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా రానా నటించిన అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రానా మరో పాన్ ఇండియా చిత్రాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
రానా హీరోగా పాన్ ఇండియా తరహాలో విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాను సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ నిర్మించనున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత రానా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.
గతంలో ఈ నిర్మాణ సంస్థలో బాలకృష్ణ టాప్ స్టొరీ, దేవుడు, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ అనే బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా విషయానికి వస్తే మంత్ర తంత్రాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కనున్న ఈ చిత్రానికి గృహం ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…