Jr.NTR: అసాధ్యం కానిది ఏదీ ఉండదు.. బైక్ సీన్ ట్రోల్స్ పై స్పందించిన ఎన్టీఆర్!

Jr.NTR: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే ఏదో ఒక విషయంలో వారి గురించి నెటిజన్లకు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వారి వ్యక్తిగత విషయం గురించి అయినా లేదా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు గురించి అయినా భారీగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతుంటారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన తారక్ విషయంలో కూడా ఇలాంటి ట్రోలింగ్స్ జరిగాయి.

ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ లో భాగంగా ఎన్టీఆర్ ఎంతో ఆవేశంతో బైక్ ఎత్తే సీన్ ఉండగా ఈ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నప్పటికీ ఈ సీన్ పై కొందరు నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్స్ చేస్తున్నారు. అంత బరువైన బైక్ ఎన్టీఆర్ అంత సులువుగా ఎలా ఎత్త గలిగాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Jr.NTR: ఆ సమయంలో అసాధ్యం కానిది ఏదీ ఉండదు.. ట్రోల్స్ పై స్పందించిన ఎన్టీఆర్!

ఇలా ఈ సన్నివేశంపై నెటిజన్ల నుంచి భారీగా ట్రోలింగ్ రావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్టీఆర్ కు ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు తారక్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. జక్కన్న ఇదే సన్నివేశాన్ని నాకు వివరించినప్పుడు నేను కూడా తనని ఇదే ప్రశ్న అడిగాను. ఆ సమయంలో జక్కన్న అత్యుత్సాహం, తీవ్రమైన ఆవేశంలో ఉన్న సమయంలో మనిషికి అసాధ్యం కాని పని అంటూ ఏదీ ఉండదని రాజమౌళి సమాధానం చెప్పినట్లు ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సినిమా చూస్తే అసలు విషయం తెలుస్తుంది..

ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చూస్తే అసలు బైక్ ఎత్తడానికి గల కారణం ఏమిటి అనే విషయం చాలా క్లారిటీగా తెలుస్తుందని తారక్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల రావాల్సి ఉండగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపధ్యంలో సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు RRR చిత్ర యూనిట్ ప్రకటించింది.