Sruthi Hassan: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో పరాజయాలను ఎదుర్కొంది. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే వరుస ఫ్లాప్ చిత్రాలను చవిచూసిన ఈమెను ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ అంటూ ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. అయితే శృతిహాసన్ తనపై పడిన ఈ ముద్రను అతి తక్కువ సమయంలోనే చెరిపేసిందని చెప్పవచ్చు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతి హాసన్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా బలుపు, శ్రీమంతుడు, సరైనోడు వంటి వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈమె తన ప్రేమ వ్యవహారాల కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
ఇంతకుముందు విదేశీ వ్యక్తితో ప్రేమలో పడిన శృతిహాసన్ తనని పెళ్లి చేసుకునే వరకు వీరి వ్యవహారం వెళ్ళింది. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా అతని తో విడిపోయిన ఈమె గత కొంత కాలం నుంచి శంతను హజారికాతో ఎంతో చనువుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పలు సందర్భాలలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంట పడటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నలడుగుతూ ‘ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ తో బ్రేక్ అప్ చెప్పుకున్నావు’ అంటూ ప్రశ్నించారు. తన ఉద్దేశం అర్థం చేసుకున్న శృతిహాసన్ ముందు నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పు.. ఎవరూ లేరనుకుంటాను. జీరో లేదా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటుందని శృతి హాసన్ ఘాటుగా స్పందిస్తూ అతని నోరు మూయించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…