RRR Movie: ఆర్ఆర్ఆర్ విషయంలో బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న జక్కన్న.. సెంటిమెంట్పండుతుందా?
RRR Movie: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే పలు నగరాలలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే త్వరలో ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫ్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించడానికి చిత్ర బృందం సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను కూడా తిరుపతిలో నిర్వహించారు.
ఈ క్రమంలోనే రాజమౌళి బాహుబలి సెంటిమెంట్ తోనే
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో ప్లాన్ చేస్తున్నారు. మరి బాహుబలి సినిమాకు వర్కవుట్ అయిన విధంగానే ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ,రోజురోజుకు కరోనా కేసులు కూడా అధికమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై రాజమౌళి స్పందిస్తూ సినిమాని ఎట్టిపరిస్థితులలోనూ అనుకున్న తేదీలోగా విడుదల చేయాలని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…