Jr.NTR: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే ఏదో ఒక విషయంలో వారి గురించి నెటిజన్లకు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వారి వ్యక్తిగత విషయం గురించి అయినా లేదా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు గురించి అయినా భారీగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతుంటారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన తారక్ విషయంలో కూడా ఇలాంటి ట్రోలింగ్స్ జరిగాయి.
ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ లో భాగంగా ఎన్టీఆర్ ఎంతో ఆవేశంతో బైక్ ఎత్తే సీన్ ఉండగా ఈ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నప్పటికీ ఈ సీన్ పై కొందరు నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్స్ చేస్తున్నారు. అంత బరువైన బైక్ ఎన్టీఆర్ అంత సులువుగా ఎలా ఎత్త గలిగాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇలా ఈ సన్నివేశంపై నెటిజన్ల నుంచి భారీగా ట్రోలింగ్ రావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్టీఆర్ కు ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు తారక్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. జక్కన్న ఇదే సన్నివేశాన్ని నాకు వివరించినప్పుడు నేను కూడా తనని ఇదే ప్రశ్న అడిగాను. ఆ సమయంలో జక్కన్న అత్యుత్సాహం, తీవ్రమైన ఆవేశంలో ఉన్న సమయంలో మనిషికి అసాధ్యం కాని పని అంటూ ఏదీ ఉండదని రాజమౌళి సమాధానం చెప్పినట్లు ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చూస్తే అసలు బైక్ ఎత్తడానికి గల కారణం ఏమిటి అనే విషయం చాలా క్లారిటీగా తెలుస్తుందని తారక్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల రావాల్సి ఉండగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపధ్యంలో సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు RRR చిత్ర యూనిట్ ప్రకటించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…