Nutritionist doctor Sujatha: యువతలో గుండెపోటుకు కారణాలు ఇవే… రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..: న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత

Nutritionist Doctor Sujatha : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండెపోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్తవయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే అంశాల గురించి న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత వివరించారు.

జంక్ ఫుడ్ పెద్ధ విరోధి…

డాక్టర్ సుజాత ప్రస్తుతం మారుతున్న జీవన సరళి వల్ల గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసు వారికే వస్తున్నాయని తెలిపారు. ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, స్మార్ట్ ఫోన్ అధికంగా వాడటం అలాగే జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే ప్రజలు పండ్లు, కూరగాయల వాడకం తగ్గించారు. చిన్న వయసులో గుండె సంబంధిత వ్యాధులకు ఆహారపు అలవాట్లు అసలు కారణం అంటూ చెప్పారు.

మిల్లెట్స్, బ్రౌన్ రైస్ వంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అన్ని రకాల పండ్లు కూరగాయలు కూడా అలవాటు చేసుకోవాలి. నిజానికి గుండెకు మంచి చేసే సాచురేటెడ్ కొవ్వులు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. కానీ ప్రస్తుతం చెడు కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాల వాడకం అధికంగా ఉంది. ఇక ఆల్కహాల్ అలాగే ధూమపానం వంటివి కూడా గుండెకు చేటు చేస్తాయి అంటూ చెప్పారు. ఇక స్ట్రెస్ గుండె జబ్బులకు ప్రధాన కారణం అంటూ చెప్పారు.