ఒమిక్రాన్ ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకు పాఠశాలల మూసివేత..!

ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఈ సారి త్వరలోనే మూడో వేవ్ రానుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. వివిధ దేశాల అధిపతులు ఇప్పటికే విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతూ.. టెస్ట్ చేసి.. నెగెటివ్ వస్తేనే వాళ్ల దేశాల్లోకి ఎల్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్.. అంతకముందు వచ్చిన వేరియంట్ల కంటే ఎంతో ప్రమాదకరమైనది అని ఇప్పటికే అధికారులు, వైద్యులు హెచ్చరించారు.

ఇక మన భారతదేశానికి వస్తే.. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచి.. కోవిడ్ టెస్టుల తర్వాత వాళ్లను బారత్ లోకి అనుమతిస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే వారి విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ మహమ్మారి భయాందోళనల నేపథ్యంలో పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఒకటి నుంచి 7వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించారు. ప్రస్తుతం దానిని డిసెంబర్ 15 వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సమీక్షించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతక ముందు పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిసెంబర్ 1 నుంచి పాఠశాలలను పుణ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.