ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘ఢీ’ రియాల్టీ డ్యాన్స్ షోలో ఒక జడ్జిగా పూర్ణ చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆమె తెలుగులో ‘సీమ టపాకాయ్’ చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ సినిమాలో అల్లరి నరేష్ తో జతకట్టారు. అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. తర్వాత పలు క్రేజీ సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అవును’ సినిమా చేస్తున్న సమయంలో తనకు బోయపాటి నుంచి ఆఫర్ వచ్చిందని.. అనుకోని కారణాల వల్ల వదిలేసుకోవాల్సి వచ్చిందన్నారు.
ప్రస్తుతం ‘అఖండ’లో ఆ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె ఇలా మాట్లాడారు. నిజానికి ఇప్పుడీ చిత్రంలో నేను పోషించిన పాత్రను తొలుత మరో నటిచేయాల్సింది. తర్వాత ఆ పాత్రకు నన్ను సంప్రదించగానే షాకయ్యా.
ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాది ఓ చిన్న పాత్రై ఉంటుందేమో అనుకున్నా. బోయపాటి సర్ కథ గురించి.. నా పాత్రకున్న ప్రాధాన్యత గురించి చెప్పాక చాలా ఆనందంగా అనిపించిందన్నారు. ఇక మంచి చెడులను తెలుసుకుంటూ.. కేరళ నుంచి వచ్చిన తాను తెలుగులో సంపూర్ణంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇక సెలెబ్రిటీలు అనే వాల్లు పబ్లిక్ ప్రాపర్టీ అని.. ఎదుకంటే.. వాళ్ల వళ్లనే సెలెబ్రిటీ హోదా వచ్చిందని చెప్పుకొచ్చారు.
నెగిటివ్ .. పాజిటివ్ కామెంట్లను ఒకేలా తీసుకోవాలన్నారు. ఇక డబ్బే కాలవాలంటే.. తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీసి ఉండాలని.. కెరీర్ సాఫీగా కొనసాగాలంటే.. మంచి పాత్రల్లోనే నటించాలని చెప్పింది. ఏదేమైనా ఇప్పుడు బోయపాటి – బాలకృష్ణల కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంలో నేను భాగమయ్యా. ఎంతో సంతృప్తిగా ఉందన చెప్పారు.
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…