ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఈ సారి త్వరలోనే మూడో వేవ్ రానుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. వివిధ దేశాల అధిపతులు ఇప్పటికే విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.
విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతూ.. టెస్ట్ చేసి.. నెగెటివ్ వస్తేనే వాళ్ల దేశాల్లోకి ఎల్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్.. అంతకముందు వచ్చిన వేరియంట్ల కంటే ఎంతో ప్రమాదకరమైనది అని ఇప్పటికే అధికారులు, వైద్యులు హెచ్చరించారు.
ఇక మన భారతదేశానికి వస్తే.. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచి.. కోవిడ్ టెస్టుల తర్వాత వాళ్లను బారత్ లోకి అనుమతిస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే వారి విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ మహమ్మారి భయాందోళనల నేపథ్యంలో పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఓ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఒకటి నుంచి 7వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించారు. ప్రస్తుతం దానిని డిసెంబర్ 15 వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సమీక్షించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతక ముందు పుణె మున్సిపల్ కార్పొరేషన్ డిసెంబర్ 1 నుంచి పాఠశాలలను పుణ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…