Pagal Pavithra : మా నాన్న చనిపోతాడు అనగానే… హ్యాపీగా ఫీల్ అయ్యాను…: పాగల్ పవిత్ర

Pagal Pavithra : జబర్దస్త్ ఎంతో మందికి జీవితాన్ని ఇస్తోంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎంతో మంది కేర్ అఫ్ లేని వాళ్లకు జబర్దస్త్ గుర్తింపునిచ్చింది. అక్కడి నుండి ఎంతో మంది కమెడియన్స్ సినిమాల్లోకి వచ్చారు. ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి సెలబ్రిటీస్ అయిపోయారు. అలా జబర్దస్త్ లో కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలతో వచ్చి బాగా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి పవిత్ర. జబర్దస్ నుండి పాగల్ పవిత్ర గా మంచి గుర్తింపు తెచ్చుకుని పలు షోస్ తో కరీర్ ని సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్న పవిత్ర రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.

నాన్న చనిపోతాడు అన్నపుడు హ్యాపీగా అనిపించింది…

ఎవరికైనా తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రి దగ్గగర ఎక్కువ చనువు, ప్రేమ ఉంటాయి. అలాంటిది తండ్రి చనిపోతాడు అన్నపుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటూ పాగల్ పవిత్ర చెప్పడం కొంచం ఆశ్చర్యం కలిగించినా అందులో ఎంత బాధ ఉందో ఆమె మాటల్లోనే అర్థమవుతుంది. అందరికీ ఉన్నట్లు నాన్న బాధ్యతలు తీసుకుని కుటుంబంతో ప్రేమగా ఉంటే చాలా బాగుండేది అంటూ పవిత్ర తన తండ్రి గురించి చెప్పింది.

తాగుడికి బాగా బానిసగా మారిన తండ్రి తల్లిని తనను బాగా బాధపెట్టాడని ఉన్నది ఒకటే కూతురునైనా నన్ను పట్టించుకోలేదని చెప్పింది. మా నాన్న సరిగా ఉండుంటే నా జీవితం మరోలా ఉండేదంటూ చెప్పిన పవిత్ర ఫాదర్స్ డే లాంటివి అందరూ చేసుకుంటున్నపుడు మా నాన్న అలా ఉంటే ఎంత బాగుండునో కదా అనిపించేది అంటూ చెప్పింది. అనారోగ్యం కారణంగా తండ్రి చనిపోతాడు అని తెలిసినపుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటూనే ఎమోషనల్ అయిపోయింది పాగల్ పవిత్ర.