Pandit Krishnamacharya : మెగా మనవరాలి పేరులో ఆ మార్పులు చేయాల్సిందే…: స్వామీజీ పండిట్ కృష్ణమాచార్య

Pandit Krishnamacharya : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసనకు జూన్ 20 న కూతురు పుట్టింది. పాప పుట్టగానే అటు మెగా ఫ్యామిలీ లోనూ ఇటు మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పాప పుట్టాక సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మంగళవారం నాడు మా ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందంటూ చిరంజీవి గారు మనవరాలి గురించి చెబుతూ ఆనందపడిపోయారు. అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా ఎవరినీ వదలదు. ఇన్నిరోజులు మెగా ఇంట్లో వారసులు రాలేదని రామ్ చరణ్, ఉపాసన లను ట్రోల్ చేసారు. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె గర్భవతి అయినా కడుపు కనిపించడం లేదు అంటూ సరోగసీ అంటూ ఏవేవో మాట్లాడారు. తాజాగా పుట్టిన పసి పాపను కూడా వదలడం లేదు. జాతకాలు అంటూ కొంతమంది అత్యుత్సాహంతో వీడియోలను పెట్టగా తాజాగా పాపం పేరు గురించి కూడా వీడియోలను పెడుతున్నారు.

పాప పేరులో మార్పు చేయాలి…

తాజాగా ఉపాసన రామ్ చరణ్ దంపతులు పాపకు బారసాల చేసారు. ఉయ్యాలలో వేసిన పాప పిక్ ఇపుడు బాగా వైరల్ అయింది. ఇక అలానే ట్విట్టర్ ద్వారా పాపకు “క్లీం కార కొణిదెల” అనే పేరును పెట్టినట్లు తెలిపారు. ఇక పాప పేరు గురించి స్వామీజీ పండిట్ కృష్ణమాచార్య మాట్లాడుతూ అమ్మవారి పేరును పెట్టడం శుభదయాకం అయితే పాపం పేరులో అక్షరాలను కలిపితే మరో అక్షరం పేరులో జోడిస్తే పేరుకు బలం చేకూరుతుందని చెప్పారు.

ఆంగ్లంలో పేరు రాసినపుడు కార లో మరో ఇంగ్లిష్ అక్షరం ఏ జోడిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు. పాప జాతకం ప్రకారం పునర్వసు నక్షత్రంలో జన్మించడం వల్ల కే అనే అక్షరం వచ్చిందని, పాప మంగళవారం నాడు పుట్టాడం వల్ల అమ్మవారి మంత్రోచ్చారణలో శక్తికి ప్రతీక అయిన క్లీం కారం ను పేరులో తీసుకోన్నారు కావున ఆ అమ్మాయికి అది మంచి చేస్తుందని చెప్పారు.