Movie News

Rakulpreeth Singh: ఆ హీరో వల్లే నా కెరియర్ నాశనమైంది… ఆ సీనియర్ హీరో పై రకుల్ కామెంట్స్!

Rakulpreeth Singh: కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీతిసింగ్ ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో ఆగ్ర హీరోలందరి సరసన నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రకుల్ ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

సౌత్ ఇండస్ట్రీలో చివరిగా ఈమె నటించిన మన్మధుడు 2, చెక్,కొండ పొలం సినిమాలు వరుసగా ఫ్లాప్ గా నిలవడంతో ఈమెకు అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి. దీంతో బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడే పరిమితమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

నాకు హీరోయిన్ గా గుర్తింపు ఇచ్చినదే సౌత్ ఇండస్ట్రీ అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా పోయాయని తెలిపారు.ఇలా తనకు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సీనియర్ హీరోతో తాను ముద్దు సన్నివేశాలలో నటించడమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా నేను ఆ సీనియర్ హీరోతో అలాంటి సన్నివేశాలలో నటించడాన్ని ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు అందుకే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని ఈమె కామెంట్ చేశారు.

Rakulpreeth Singh:నాగార్జున కారణమా…


ఇక ఆ హీరో పేరు రకుల్ చెప్పకపోయినా ఈమె నాగార్జున ఉద్దేశించే చెప్పారని అర్థమవుతుంది. నాగార్జునతో కలిసి నటించిన మన్మధుడు2సినిమాలో ఈమె ముద్దు సన్నివేశాలలో నటించారు. అయితే నాగార్జునతో ఇలా నటించడానికి ప్రేక్షకులు ఏమాత్రం స్వీకరించలేక ఈ సినిమా సమయంలో తీవ్రమైన ట్రోల్స్ కూడా చేశారు. దీంతో నాగార్జున కారణంగానే తన కెరీర్ నాశనమైందని పరోక్షంగా రకుల్ ఈ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago