Ramcharan -Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కుమార్తెకు ఘనంగా బారసాల వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన దంపతులు తమ చిన్నారికి క్లిన్ కారా అనే నామకరణం చేశామని ప్రకటించారు.
ఇలా తమ కుమార్తె పేరును రివీల్ చేయడంతో పేరు చాలా విభిన్నంగా ఉందని అందరూ భావించడమే కాకుండా అసలు ఈ పేరుకు అర్థం ఏంటి అని కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఈ పేరును లలితా సహస్రనామాల నుంచి ఎంపిక చేసామని ఉపాసన తెలియజేశారు. మరి తమ చిన్నారికి పెట్టిన క్లిన్ కారా పేరుకు అర్థం ఏంటి అనే విషయానికి వస్తే..
ఉపాసన తన కుమార్తెకు పెట్టిన క్లిన్ కారా అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాత శక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని చూచిస్తుంది.ఆ పేరుకు ఎంతో శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అంటూ స్వయంగా ఈ పేరుకు అర్ధాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు. ఇక చిన్నారి ఎదుగుతున్న కొద్ది ఈ లక్షణాలన్నింటినీ తనలో పెంపొందించుకుంటుంది అంటూ ఈ సందర్భంగా చిన్నారి పేరుకు అర్థాన్ని తెలియజేశారు.
రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జన్మించిన ఈ చిన్నారికి క్లిన్ కారా కొణిదెల అనే పేరు పెట్టడంతో ఈ పేరును KKK గా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.ఇలా పాప పేరు ఎంతో అర్థవంతంగా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు చిన్నారి పేరుతో పాటు తన ఫేస్ కూడా రివీల్ చేసి ఉంటే బాగుండేది అని భావిస్తున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…