బొప్పాయిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. కానీ వీరు మాత్రం తీసుకోకూడదు..!

మనకు లభిస్తున్న పండ్లల్లో చాలా వరకు సీజన్ వారీగా అందుబాటులో ఉంటాయి. కానీ బొప్పాయి మాత్రం ఏడాది అంతటా అందుబాటులో ఉంటుంది. దీని వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది ఈ పండును ఇష్టపడతారు కూడా. కొంతమంది ఈ బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడానికి ఇష్టపడతారు.

ఇంకా కొందరు సలాడ్ లేదా స్నాక్ సమయాల్లో తింటారు. బొప్పాయి ఆకుల రసం అయితే.. ప్లేట్ లెట్స్ పడిపోయిన వారికి ఎంతో ఉపయోకరంగా పనిచేస్తుంది. దీనిని సైంటిఫిక్ గా కూడా రుజువు చేశారు. ప్లేట్ లెట్స్ పడిపోయిన వారికి.. ఈ రసంలో కొంచెం తేనెను కలుపుకొని తాగితే అద్బుతంగా పనిచేస్తుందని రుజువు చేశారు. ఒక్క రోజులోనే లక్ష నుంచి 1.5 లక్షల వరకు కౌంట్ పెరిగినట్లు నిర్ధారించారు.

బొప్పాయి ఆకుల రసాన్ని దోమల వల్ల వచ్చే డెంగ్యూ జ్వరాన్ని ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న బొప్పాయిని ఎక్కువగా తింటే.. అన్నవాహిక దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న వాళ్లు దీనిని తనకూడదు.
ఎందుకంటే.. ఇది గర్భాశయ సంకోచానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి అనేది సమతుల్యంగా ఉండాలి. దీనిని తినడం వల్ల అకస్మాత్తుగా తగ్గుతుంది.

అందుకే ఎక్కువగా తినకపోవడం మంచిది. దీనిలో పెన్సిల్ ఐసోథియోసైనేట్ అనే పదార్థం ఉంటుంది. ఇదే విషానికి కారణం అవుతుంది. అందుకే దీనిని మితంగా తినాలని అంటుంటారు. బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ ఏ, సి అవసరం. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. బొప్పాయిలో కూడా విటమిన్ సీ ఉంటుంది. అందుకే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.