Paruchuri Gopalakrishna: అన్నయ్య కారణంగా 100 ఎకరాల ఆస్తులు పోగొట్టుకున్నా: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopalakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరుచూరి బ్రదర్స్ చేసినటువంటి సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరు దాదాపు 300 సినిమాలకు కథలను అందించి ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు.అయితే వీరిద్దరూ రచయితలుగా మాత్రమే కాకుండా దర్శకులుగా నటులుగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.

ఇక ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావుకి వయసు పై పడటంతో ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ గోపాలకృష్ణ మాత్రం ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల గురించి విశ్లేషణ ఇస్తూ వీడియోలు చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గోపాలకృష్ణ తాను ఆస్తులు కోల్పోవడం గురించి తెలియజేశారు.

శోభన్ బాబు హీరోగా తాను ఒక సినిమాకు దర్శకత్వం వహించానని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామానాయుడు సురేష్ బాబు గారు ఈ సినిమా పక్క హిట్ అవుతుందని చెప్పారు. వారు చెప్పిన విధంగానే సినిమా చాలా మంచి సక్సెస్ అయింది.ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇతర నిర్మాతలు తన వద్ద డబ్బులు కట్టలు ముందు పెట్టి తమ బ్యానర్లో సినిమా చేయాలని కోరారు.

Paruchuri Gopalakrishna నోట్ల కట్లు ముందున్న తీసుకోలేదు..


ఇలా నోట్ల కట్టలు నా ముందు ఉన్నప్పటికీ నేను వాటిని తీసుకోలేదు. అప్పటికి సురేష్ బాబు మీరు ఈ డబ్బు తీసుకోండి శంకరంపల్లిలో భూమి కొందామని చెప్పినప్పటికీ అన్నయ్య మాత్రం ఆ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు.వాడు దర్శకుడు అయితే నేను ఫిడేల్ వాయించుకోవాలా అంటూ మాట్లాడారు. అలా అన్నయ్యకు ఇష్టం లేకుండా నేను ఆ డబ్బును తీసుకోలేదు. ఆ రోజు కనుక ఆ డబ్బు తీసుకొని ఉంటే శంకరంపల్లిలో 100 ఎకరాల ఆస్తి నా సొంతం అయ్యేది. అప్పట్లో ఎకరం 10000 మాత్రమేనని ఈ సందర్భంగా గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.