Jr.NTR: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమా కొరటాల శివ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా తన సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతు ఉన్నటువంటి ఎన్టీఆర్ తాజాగా సినీ సెలబ్రిటీలకు గ్రాండ్గా తన ఇంట్లో పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ పార్టీకి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.
ఇక ఈ పార్టీలో అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ కూడా ఈ పార్టీలో సందడి చేయడం విశేషం. ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… నా ఫ్రెండ్స్, కావలసిన వారితో ఈవినింగ్ సరదాగా గడిచింది. పార్టీకి వచ్చినందుకు థాంక్స్ జేమ్స్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
ఇక ఈ పార్టీలో డైరెక్టర్ రాజమౌళి, కొరటాల శివ, శోభు యార్లగడ్డ, శిరీష్, మైత్రి నవీన్, రవిశంకర్ దిల్ రాజు కుమార్తె హన్షితరెడ్డి వంటి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పార్టీకి రాంచరణ్ మాత్రం దూరంగా ఉన్నారు.దీంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ తాజాగా మాల్దీవ్ ట్రిప్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ ఈ పార్టీకి రాంచరణ్ దూరంగా ఉన్నారు. గత నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీకి తారక్ దూరంగా ఉన్నారు.ఇలా రామ్ చరణ్ ఎన్టీఆర్ పార్టీకి రాకపోవడం ఎన్టీఆర్ రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి వెళ్లకపోవడంతో ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…