Pathaan: అక్కడ RRR రికార్డులను బద్దలు కొట్టిన షారుక్ పఠాన్… బాద్షా క్రేజ్ మామూలుగా లేదుగా?

Pathaan: బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన షారుక్ ఖాన్ గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే కొంత సమయం గ్యాప్ తీసుకున్న తర్వాత ఈయన తాజాగా పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో షారుక్ సరసన దీపిక పదుకొనే నటించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అయితే ఈ సినిమా జనవరి 25వ తేదీ అత్యధిక థియేటర్లలో విడుదలై ఎంతో అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా అన్ని ఏరియాలలో సుమారు 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం.

ఈసినిమాకు కూడా ఓ రేంజ్‌లో బుకింగ్స్ జరిగాయి. బాహుబలి 2(హిందీ)కి 6.50 లక్షల టిక్కెట్స్ బుక్ అవ్వగా.. పఠాన్‌కు 5.56 లక్షల టిక్కెట్స్ బుక్ అయ్యి రెండో స్థానంలో నిలిచింది. అయితే అమెరికాలో మాత్రం షారుక్ ఖాన్ సినిమా ఏకంగా RRR రికార్డులను బద్దలు కొట్టింది.

Pathaan: RRR కలెక్షన్లను క్రాస్ చేసిన పఠాన్..

RRR అమెరికాలో $14.3 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పఠాన్ తాజాగా $14.4 మిలియన్ డాలర్స్‌ను వసూలు రాబడుతూ RRR సినిమా రికార్డులను చెరిపివేసింది. ఇలా ఈ సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టడంతో షారుక్ ఖాన్ అమెరికాలో మామూలుగా లేదు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.