Naveen Reddy: ఎన్ స్క్వైర్ కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు మేరకు సినీ నటుడు నవీన్ రెడ్డి అట్లూరినీ రెండు రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. నవీన్ రెడ్డి ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరించేవారు. అయితే ఈయన ఇతర డైరెక్టర్లకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేసి భారీగా డబ్బులను నొక్కేసారని ఇతర డైరెక్టర్లు నవీన్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నవీన్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో దాదాపు 55 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని ఇతర డైరెక్టర్లు ఈయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ పోలీసులు తనని అరెస్టు చేసి గత రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణలో భాగంగా నటుడు నవీన్ రెడ్డి నిజాలు అన్నింటిని బయటపెట్టినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే నవీన్ రెడ్డి డైరెక్టర్ గా బాధ్యతలు వ్యవహరిస్తూ ఇతరులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాల ద్వారా 38 కోట్ల రూపాయల డబ్బును నొక్కేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్ స్క్వేర్ కంపెనీకి చెందిన ఆస్తులను కూడా తన పేరు పైకి మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయాలన్నీ స్వయంగా నవీన్ రెడ్డికి పోలీసులు ముందు ఒప్పుకున్నారు.
ఈ కంపెనీ నుంచి భారీగా డబ్బులను స్కామ్ చేసి సొంతంగా తానే హీరోగా హీరోగా నోబడీ అనే సినిమాను చేశారు. అలాగే భారీగా జల్సాలు చేయడంతో అనుమానం వచ్చిన ఇతర డైరెక్టర్స్‌కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు నవీన్ రెడ్డిపై 420, 465,468,471 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలా కేసు నమోదు చేసిన అనంతరం విచారణ చేపట్టడంతో నవీన్ రెడ్డి తాను చేసిన నేరాలను అంగీకరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…