Rajinikanth -Kamal Hassan: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులుగా స్టార్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమల్ హాసన్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే ఈ ఇద్దరు హీరోల వయసు పెరుగుతున్న కొద్ది వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో కమల్ హాసన్ కాజల్ అగర్వాల్ రకుల్ హీరో హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ చివరి దశకు చేరుకుంది.
ఇకపోతే రజినీకాంత్ సైతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా మోహన్ లాల్ వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా కూడా చివరి దశ షూటింగ్ కు చేరుకుంది. ఇకపోతే ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది.
కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఒకే రోజున కమల్ హాసన్ రజినీకాంత్ సినిమాలు రెండు విడుదలకు సిద్ధం కాబోతున్నాయని సమాచారం. అయితే సుమారు 18 సంవత్సరాలు తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ బరిలో పోటీకి దిగబోతున్నారు. 2005 వ సంవత్సరంలో రజనీకాంత్ నటించిన చంద్రముఖి కమల్ హాసన్ నటించినముంబై ఎక్స్ప్రెస్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో చంద్రముఖి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…