Pathaan: బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన షారుక్ ఖాన్ గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే కొంత సమయం గ్యాప్ తీసుకున్న తర్వాత ఈయన తాజాగా పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో షారుక్ సరసన దీపిక పదుకొనే నటించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అయితే ఈ సినిమా జనవరి 25వ తేదీ అత్యధిక థియేటర్లలో విడుదలై ఎంతో అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా అన్ని ఏరియాలలో సుమారు 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం.
ఈసినిమాకు కూడా ఓ రేంజ్‌లో బుకింగ్స్ జరిగాయి. బాహుబలి 2(హిందీ)కి 6.50 లక్షల టిక్కెట్స్ బుక్ అవ్వగా.. పఠాన్‌కు 5.56 లక్షల టిక్కెట్స్ బుక్ అయ్యి రెండో స్థానంలో నిలిచింది. అయితే అమెరికాలో మాత్రం షారుక్ ఖాన్ సినిమా ఏకంగా RRR రికార్డులను బద్దలు కొట్టింది.
RRR అమెరికాలో $14.3 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పఠాన్ తాజాగా $14.4 మిలియన్ డాలర్స్‌ను వసూలు రాబడుతూ RRR సినిమా రికార్డులను చెరిపివేసింది. ఇలా ఈ సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టడంతో షారుక్ ఖాన్ అమెరికాలో మామూలుగా లేదు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…