Pawan Kalyan: నువ్వు ఎన్టీరామారావు కాదు.. ఎంజీఆర్ కాదు పవన్ పై విమర్శలు చేసిన వర్మ!

Pawan Kalyan: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గురించి రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ మరొకసారి వైరల్ గా మారింది. రాంగోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ కి తన మద్దతు తెలుపుతూ ఉంటాడు.

ఈ క్రమంలో జగన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే రాంగోపాల్ వర్మ స్పందిస్తూ కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ని ఉద్దేశిస్తూ.. జగన్ ని పెట్టి ఎవరైనా ‘పాపం పసివాడు’ అనే సినిమా తీయాలంటూ పవన్ కల్యాణ్ సెటైరికల్ ట్వీట్ చేశాడు. తాజాగా ఈ ట్వీట్ కు దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ తనదైన రీతిలో పవన్ కల్యాన్ మీద కౌంటర్లు వేశాడు.

ఈ క్రమంలో ” ఈ సినిమా నీతో కూడా ఎవరైనా తీయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అజ్ఞానంతో కూడిన అమాయకత్వం.. అమాయకత్వంతో కూడిన దద్దమ్మగా ఉన్నందుకు నీ మీద ఈ సినిమా తీయాలని నేను ఆశిస్తున్నాను అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చాడు. అంతే కాకుండా ” ఇక్కడ ఒక చిన్న మార్పు చేయాలి : ఆ ఒక్క పాత్ర.. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతూ అనేక పాత్రలుగా కనిపించేలా దీన్ని మార్చాలి..’ అంటూ విమర్శలు గుప్పించారు.

Pawan Kalyan: ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు…

ఈ మేరకు పవన్ కళ్యాణ్ పేరును ట్యాగ్ చేస్తూ.. ‘నువ్వు ఎన్టీరామారావు కాదు ఎంజీఆర్ కాదు ..నీకు ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు. ‘ప్రజాసేవ’ ముసుగులో.. అమాయక అభిమానులను రెచ్చగొట్టి, హింసను ప్రేరేపించే విధానాలు నీవి. ఏదో ఒక రోజు మీ జన సైనికులు నీ నుండి, నీ మానసిక నార్సిజం నుండి విముక్తి పొందుతారు..’ అంటూ పవన్ కల్యాణ్ రాసినట్టుగానే రాసి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.