Movie News

Varun Tej -Lavanya Tripati: మెగా కుటుంబంలో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి ముహూర్తం పిక్స్..?

Varun Tej -Lavanya Tripati: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల F3 సినిమా ద్వారా వెంకటేష్ తో కలిసి ప్రేక్షకులను అలరించిన వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా గురించి ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన వరుణ్ తేజ్ వివాహం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ కలిసి ‘మిస్ట‌ర్‌’, ‘అంత‌రిక్షం’ వంటి సినిమాలలో జంటగా న‌టించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిమధ్య ప్రేమ మొదలైనట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య ఇంటికి వెళ్ళి ఆమె పేరెంట్స్ ని ఒప్పించినట్లు కూడా వార్తలు వినిపించాయి.

వీరిద్దరు ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికి..మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఈవెంట్స్‌లో లావణ్య త్రిపాఠి సందడి చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. తాజాగా మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది. లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్ లో జరగనుందని తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

Varun Tej -Lavanya Tripati: ఈ ఏడాదిలోనే వివాహం…

ఇదిలా ఉండగా నాగ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో తొందర్లోనే వరుణ్ కి చేస్తానని తెలిపాడు. అయితే వరుణ్ – లావణ్య ల గురించి ప్రశ్నించగా.. ఆయన ‘నొ’ చెప్పలేకపోవటమేకాకుండా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయం పై వరుణ్ అధికారికంగా స్పందిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి తొందర్లోనే జరగబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా వరుణ్, లావణ్య నిశ్చితార్థం తేది కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. జూన్ లో వీరి నిశ్చితార్థం జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాలి మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago