Varun Tej -Lavanya Tripati: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల F3 సినిమా ద్వారా వెంకటేష్ తో కలిసి ప్రేక్షకులను అలరించిన వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా గురించి ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన వరుణ్ తేజ్ వివాహం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలలో జంటగా నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిమధ్య ప్రేమ మొదలైనట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య ఇంటికి వెళ్ళి ఆమె పేరెంట్స్ ని ఒప్పించినట్లు కూడా వార్తలు వినిపించాయి.
వీరిద్దరు ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికి..మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఈవెంట్స్‌లో లావణ్య త్రిపాఠి సందడి చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. తాజాగా మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది. లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్ లో జరగనుందని తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

Varun Tej -Lavanya Tripati: ఈ ఏడాదిలోనే వివాహం…
ఇదిలా ఉండగా నాగ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో తొందర్లోనే వరుణ్ కి చేస్తానని తెలిపాడు. అయితే వరుణ్ – లావణ్య ల గురించి ప్రశ్నించగా.. ఆయన ‘నొ’ చెప్పలేకపోవటమేకాకుండా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయం పై వరుణ్ అధికారికంగా స్పందిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి తొందర్లోనే జరగబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా వరుణ్, లావణ్య నిశ్చితార్థం తేది కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. జూన్ లో వీరి నిశ్చితార్థం జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాలి మరి.