Sharwanand: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఈ ఏడాది జనవరిలో రక్షిత రెడ్డి అనే యువతితో నిశ్చితార్థం చేసుకొని బ్యాచలర్ లైఫ్ కి స్వస్తి చెప్పాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. అయితే నిశ్చితార్థం జరిగే ఐదు నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు పెళ్లి గురించి ప్రస్తావించకపోవడంతో శర్వానంద్ – రక్షిత రెడ్డి పెళ్లి రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా శర్వానంద్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. శర్వానంద్ రక్షిత రెడ్డి వివాహ వేడుక జూన్ 2,3 తేదీలలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 న ఉదయం మెహందీ ఫంక్షన్ తో పాటు సాయంత్రం సంగీత్ జరగనున్నట్లు సమాచారం.
ఇక జూన్ 3 న శర్వానంద్ రక్షిత మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. ఎట్టకేలకు నిశ్చితార్థం జరిగిన ఐదు నెలల తర్వాత శర్వానంద్ పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో శర్వానంద్ అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే శర్వానంద్ ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల పెళ్లి నీకు అంతకాలం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు శర్వానంద్ పెళ్లి తేదీ ఫిక్స్ అవ్వటంతో ఆయన సినిమా షూటింగ్ పనులు పూర్తి అయినట్లు భావిస్తున్నారు. 2 ,3 తేదీలలో జరగబోయే శర్వానంద్ రక్షిత రెడ్డిల వివాహ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులకు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్లోని లీల ప్యాలెస్ లో ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…