కరోనా వ్యాక్సిన్ వద్దంటున్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేద్దామని భావిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం శాస్త్రవేత్తలు, వైద్యులకు భారీ షాక్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా తమకు వ్యాక్సిన్ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు.

దేశంలో ఏకంగా 61 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. దేశంలోని ప్రజల్లో కరోనా వైరస్ గురించి గతంతో పోలిస్తే భయం చాలా తగ్గింది. చాలామంది ప్రజలు ఇతర వ్యాధుల్లాగే కరోనా కూడా సాధారణ ఫ్లూ మాత్రమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సర్వే అధ్యయనంలో 2021 జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చినా వేయించుకోవడానికి తాము సిద్ధంగా లేమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

లోకల్‌ సర్కిల్స్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఆన్ లైన్ లో సర్వేను నిర్వహించి ఈ విషయాలను వెల్లడించింది. 51 శాతం మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా బారిన పడకపోయినా ఇతర ఆరోగ్య సమస్యలు తమను వేధించే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. 10 శాతం తమకు వ్యాక్సిన్ వద్దేవద్దని ఖరాఖండీగా చెబుతున్నారు. 72 శాతం పురుషులు, 54 శాతం మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారని సమాచారం.

కరోనా వ్యాక్సిన్ గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. సర్వేలో మొత్తం 8,496 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు.