దేశంలో రోజురోజుకు వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. వ్యవసాయం చేసే అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని పలు సర్వేల్లో తేలింది. అలా పెళ్లి కాని రైతుల కోసం ఒక వ్యక్తి ఏకంగా మ్యారేజీ బ్యూరోను ఏర్పాటు చేశాడు. సాధారణంగా మ్యారేజీ బ్యూరో అంటే సాఫ్ట్ వేర్, అన్నారై సంబంధాలే మనకు గుర్తుకువస్తాయి. అయితే పెళ్లి కాని యుత రైతులకు మంచి పెళ్లి సంబంధాలు చూపించాలనే ఉద్దేశంతో కేతిరెడ్డి అంజిరెడ్డి అనే వ్యక్తి రైతు మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశాడు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రైతు మ్యారేజ్ బ్యురో ఏర్పాటైంది. 500 రూపాయలు వరుడు, వధువు కావాలనుకునే వారు ఈ మ్యారేజ్ బ్యూరోలో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయం అంటే చిన్నచూపు చూస్తున్న సమాజంలో రైతు మ్యారేజ్ బ్యూరో ద్వారా రైతుల పెళ్లి కష్టాలకు చెక్ పెట్టాలని అంజిరెడ్డి భావిస్తున్నాడు. పది రోజుల క్రితం అంజిరెడ్డి ఈ మ్యారేజీ బ్యూరోను ఏర్పాటు చేశాడు.
ఈ మ్యారేజ్ బ్యూరోకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అంజిరెడ్డి తనకు ప్రతిరోజూ వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని.. నిరుపేద రైతులైతే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా వసూలు చేయడం లేదని తెలిపారు. చాలామంది రైతు కుటుంబానికి అమ్మాయినిస్తే అమ్మాయి అక్కడ కష్టపడాలని అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే వ్యవసాయం తేలికైందని.. రైతులే సంతోషంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగంలో స్థిర్పడ్డ వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేశానని అంజిరెడ్డి చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…