దేశంలో రోజురోజుకు వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. వ్యవసాయం చేసే అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని పలు సర్వేల్లో తేలింది. అలా పెళ్లి కాని రైతుల కోసం ఒక వ్యక్తి ఏకంగా మ్యారేజీ బ్యూరోను ఏర్పాటు చేశాడు. సాధారణంగా మ్యారేజీ బ్యూరో అంటే సాఫ్ట్ వేర్, అన్నారై సంబంధాలే మనకు గుర్తుకువస్తాయి. అయితే పెళ్లి కాని యుత రైతులకు మంచి పెళ్లి సంబంధాలు చూపించాలనే ఉద్దేశంతో కేతిరెడ్డి అంజిరెడ్డి అనే వ్యక్తి రైతు మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశాడు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో రైతు మ్యారేజ్ బ్యురో ఏర్పాటైంది. 500 రూపాయలు వరుడు, వధువు కావాలనుకునే వారు ఈ మ్యారేజ్ బ్యూరోలో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయం అంటే చిన్నచూపు చూస్తున్న సమాజంలో రైతు మ్యారేజ్ బ్యూరో ద్వారా రైతుల పెళ్లి కష్టాలకు చెక్ పెట్టాలని అంజిరెడ్డి భావిస్తున్నాడు. పది రోజుల క్రితం అంజిరెడ్డి ఈ మ్యారేజీ బ్యూరోను ఏర్పాటు చేశాడు.

ఈ మ్యారేజ్ బ్యూరోకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అంజిరెడ్డి తనకు ప్రతిరోజూ వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని.. నిరుపేద రైతులైతే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా వసూలు చేయడం లేదని తెలిపారు. చాలామంది రైతు కుటుంబానికి అమ్మాయినిస్తే అమ్మాయి అక్కడ కష్టపడాలని అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు.

గతంతో పోలిస్తే వ్యవసాయం తేలికైందని.. రైతులే సంతోషంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగంలో స్థిర్పడ్డ వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేశానని అంజిరెడ్డి చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here