రేషన్ కార్డు ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. రూ.2500 నగదు, విలువైన సరుకులు..?

దేశంలోని పలు రాష్ట్రాల్లో హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కొత్త సంవత్సరం వచ్చిన రెండు వారాలకే వచ్చే ఈ పండుగ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పండగకు అవసరమైన సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తుంటాయి. అదే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది.

పండుగ సరుకులను ఉచితంగా ఇవ్వడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సరుకులను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. 2021 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం పళనిస్వామి ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వారిని దృష్టిలో ఉంచుకుని రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పళనిస్వామి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వం 2,500 రూపాయల నగదు తో పాటు కిలో బియ్యం, కిలో చక్కెర, చెరుకుగడ, జీడిపల్లు, కిస్ మిస్ 20 గ్రాములు, 5 గ్రాముల యాలకులు ఇవ్వనుంది. అధికారులు రేషన్ కార్డు ఉన్నవాళ్లకు టోకెన్లు జారీ చేయనుండగా టోకెన్లు ఇచ్చి డబ్బులు, సరుకులు ప్రజలకు పంపిణీ జరిగేలా చేయనున్నారు.