ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసల వర్షం కురిపించారు. నాగబాబు ప్రశంసించడం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖల నుంచి జగన్ కు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సినీ రంగం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కరోనా వల్ల నష్టపోయిన సినీ పరిశ్రమకు భారీగా రాయితీలను ప్రకటించారు.
జగన్ రాయితీలను ప్రకటించడంపై నాగబాబు స్పందిస్తూ జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాగబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో శూన్యం ఏర్పడిందని జగన్ తన నిర్ణయం ద్వారా శూన్యాన్ని పూఢ్చేశారని వెల్లడించారు. జగన్ సర్కార్ చొరవ తీసుకోవడం వల్ల సినిమా రంగానికి జవసత్వాలు చేకూరుతాయని నాగబాబు అన్నారు.
సీఎం జగన్ రాయితీల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ స్వాగతిస్తోందని నాగబాబు అన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో సీఎం జగన్ ఆదుకున్నారని నాగబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో 3 నెలల ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే, జూన్ నెలల చార్జీలను రద్దు చేయడంతో జగన్ సర్కార్ పై అదనంగా 3 కోట్ల రూపాయల భారం పడనుంది.
అయితే నాగబాబు జగన్ కు మద్దతు పలుకుతూ ట్వీట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. నాగబాబు జగన్ కు అనుకూలంగా ట్వీట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కు రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని కామెంట్లు చేస్తారు. జగన్ కు అనుకూలంగా ట్వీట్ చేసి నాగబాబు పవన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…