కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్రాడ్ కాస్ట్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్ ఇండియా ఇన్‌సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 26 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
https://www.becil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మెకానిక్, లైన్ మెన్, స్టోర్ కీపర్, వైర్ మెన్, ప్లంబర్, ఆపరేటర్, అసిస్టెంట్ ల్యాండ్రీ సూపర్ వైజర్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, శానిటరీ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒక్కో ఉద్యోగానికి ఒక్కో విద్యార్హత ఉండగా ఉద్యోగాన్ని బట్టి 20,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్ సైట్ అయిన https://www.becil.com/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 10వ తరగతి, ఇంటర్ పాసైన వాళ్లకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఐటీఐ, డిప్లొమా చదివిన వాళ్లు మాత్ర్మే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 830 రూపాయలుగా ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం 600 రూపాయలు ఫీజు చెల్లించి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా అర్హత, వేతనం దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఇతర వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…