ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేసే వాళ్లు పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. ఉద్యోగుల ఖాతాలలో త్వరలో ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ 2019 – 2020 సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ మొత్తాలపై వడ్డీ రేటును జమ చేయనుంది. 8.5 శాతం వడ్డీ ఉద్యోగుల ఖాతాలలో జమ కానుంది. ఈ నెల చివరినాటికి వడ్డీ పీఎఫ్ ఖాతాలలో జమ కానుండగా పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు సులభంగా బ్యాలన్స్ ను తెలుసుకోవచ్చు.
పీఎఫ్ ఖాతాదారులకు ఉమాంగ్ యాప్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఉమాంగ్ యాప్ సహాయంతో సులభంగా పీఎఫ్ అకౌంట్ యొక్క బ్యాలన్స్ ను తెలుసుకోవచ్చు. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఉమాంగ్ యాప్ లో మొదట ఈ.పీ.ఎఫ్.వోను ఎంచుకుని ఆ తరువాత ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ ను ఎంచుకుని వ్యూ పాస్ బుక్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత పీఎఫ్ ఖాతాకు సంబంధించిన యూఏఎన్ నంబర్ ను, ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత యాప్ లో మెంబర్ ఐడీ కనిపిస్తుంది. మెంబర్ ఐడిపై క్లిక్ చేసి సులభంగా పీఎఫ్ బ్యాలన్స్ ను తెలుసుకోవచ్చు. అయితే ఎవరైతే పీఎఫ్ అకౌంట్ తో మొబైల్ నంబర్ ను లింక్ చేసి ఉంటారో వారు మాత్రమే ఈ వివరాలను పొందగలిగే అవకాశం ఉంటుంది. ఉమాంగ్ యాప్ తో కాకుండా 011 – 22901406 నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా కూడా సులభంగా పీఎఫ్ బ్యాలన్స్ ను తెలుసుకునే ఉంది.
కాల్ చేసిన తరువాత కొంత సమయానికే మెసేజ్ రూపంలో బ్యాలన్స్ కు సంబంధించిన వివరాలు మొబైల్ ఫోన్ కు వస్తాయి. www.epfindia.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సులభంగా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ.పీ.ఎఫ్.వో పోర్టల్ లో అవర్ సర్వీసెస్ లోని మెంబర్ పాస్ బుక్ విభాగంలోకి వెళ్లి యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సులభంగా బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. “epfoho uan” అని టైప్ చేసి 7738299899 నంబర్ కు మెసేజ్ పంపించడం ద్వారా కూడా సులభంగా పీఎఫ్ బ్యాలన్స్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…